నాకు పెళ్లైంది-కైరా అద్వానీ

273
Kiara Advani
- Advertisement -

బాలీవుడ్‌లో హీరోయిన్ కైరా అద్వానీ ఒక వైపు బాలీవుడ్‌లో చిత్రాలు చేస్తూనే మరో వైపు తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతుంది. భరత్ అనే నేను చిత్రం మహేష్ బాబు సరసన నటించిన విషయం తెలిసిందే. భరత్ అనే నేను చిత్రంలో నటించడం తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా చెప్పుకొచ్చింది. తాజాగా ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించిన కైరా అద్వానీ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తిర విషయాలను వెళ్లడి చేసింది. మీడియాలో గత కొన్ని రోజులుగా కైరా అద్వానీ డేటింగ్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Kiara Advani

ఆ వార్తలపై స్పందిస్తూ.. తానెవ్వరితో డేటింగ్ లో లేనని.. అయినా నాకు ఇప్పటికే పెళ్లి అయ్యిందని చెప్పుకొచ్చింది. తాను చేసే సినిమాలను ప్రేమిస్తున్నానని – సినిమాలనే పెళ్లి చేసుకున్నానంటూ చెప్పుకొచ్చింది. వినయ విధేయ రామ చిత్రం తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మూవీలో ఈ అమ్మడు నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో వైపు హిందీలో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’లో నటిస్తోంది. ఈ చిత్రాలే కాకుండా హిందీలో మరో రెండు సినిమాలకు కూడా కమిట్ అయ్యింది. తెలుగు మరియు హిందీల్లో బిజీ బిజీగా ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది.

- Advertisement -