మందు బాబులకు షాక్..పెరిగిన ధరలు

401
Wines Shops
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందు బాబులకు షాక్ ఇచ్చింది. నేటి నుంచి మద్యంపై ధరలు పెరగనున్నట్లు తెలిపింది. ఏపీలో నేటి నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్ 1వ తేదీ (మంగళవారం) నుంచి అమల్లోకి రానుంది..మద్య నిషేధ కార్యక్రమం అమల్లో భాగంగా మద్యం బాటిళ్లపై ARET పేరిట అడిషనల్ రిటైల్ ఎక్సైజు టాక్స్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా తయారైన విదేశీ మద్యం, విదేశీ మద్యం, బీర్, వైన్ ఇతర వెరైటీ మద్యంపై ఏఆర్ఈటీ పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. యితే, ప్రభుత్వ నిర్ణయంతో 90 మిల్లీ లీటర్ల బాటిల్‌కు గరిష్టంగా రూ. 10 పన్ను పడనుంది..ఫుల్ బాటిల్ మీద రూ.250 పన్ను పడనుంది. పరిమాణం పెరిగే కొద్దీ పన్ను రెట్టింపు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..స్వదేశీ, విదేశీ మద్యం క్వార్టర్ సీసాపై రూ.20, హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80 పెరిగింది. స్వదేశీ మద్యం 60/90 ఎంఎల్ బాటిళ్లపై రూ.10, లీటరు మద్యం సీసాపై రూ.100, రెండు లీటర్ల బాటిల్‌పై రూ.250 పెంచారు. విదేశీ మద్యం 50/60 ఎంఎల్ సీసాలపై రూ.10, లీటరున్నర-రెండు లీటర్లు కలిగిన మద్యం బాటిళ్లపై రూ.250 పెరిగింది. ఇక, 330/500 ఎంఎల్ బీర్ సీసాలపై రూ.10, 650 ఎంఎల్ బీరు సీసాలపై రూ.20 పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలు ఉండగా, దశల వారీ మద్య నిషేధం అమల్లో భాగంగా వీటి సంఖ్యలను 20 శాతం తగ్గించనున్నారు. ఇక, నేటి నుంచి ఏపీలో 3500 దుకాణాలు ఏపీబీసీఎల్ ఆధ్వర్యంలో నడవనున్నాయి.

- Advertisement -