- Advertisement -
లాక్ డౌన్ పొడగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు వివిధ రాష్ట్రాల సీఎంలు. అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా వివిధ రాష్ట్రాల సీఎంలు మాట్లాడరు. ఈ సందర్భంగా ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడగించాలని ప్రధానికి సూచించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాస్కు ధరించారు. దాదాపు ముఖ్యమంత్రులందరూ కూడా మాస్కులు ధరించి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను పొడిగించాలని పలు రాష్ట్రాల సీఎంలు ప్రధానికి కోరగా సమీక్ష తర్వాత లాక్ డౌన్ కొనసాగింపుపై ప్రధాని నిర్ణయం ప్రకటించనున్నారు.
- Advertisement -