- Advertisement -
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం ప్రారంభమయ్యింది. ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 403 స్థానాలున్న యూపీలో 75 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 78 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో 15 కేంద్రాలు, 117 స్థానాలున్న
పంజాబ్‌లో 53 కేంద్రాలు, 40 స్థానాలున్న గోవాలో రెండు, 60 స్థానాలున్న మణిపూర్‌లో 12 కేంద్రాల్లోనూ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. లెక్కింపు కేంద్రాల్లో ఎన్నికల సంఘం మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఆధిక్యతలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.
ఇక అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో పార్టీల వారిగా ఫలితాలు ఇలా ఉన్నాయి.
UP (403) | PUNJAB(117) | GOA(40) | MANIPUR (60) | UTTARAKHAND(70) | |
BJP | 324 | 03 | 14 | 21 | 57 |
SP+CONG | 55 | ||||
CONG | 77 | 19 | 25 | 11 | |
BSP | 19 | ||||
AAP | 22 | ||||
SAD | 15 | ||||
OTH | 02 | 07 | 11 | 02 |
- Advertisement -