వరంగల్ లో 9నెలల చిన్నారి శ్రీనితపై అత్యాచారం చేసిన కామాంధుడు ప్రవీణ్ కేసులో సంచలన తీర్పు వెలవడింది. ప్రవీణ్‌కు మరణశిక్షను ఖరారు చేస్తూ వరంగల్ జిల్లా అదనపు కోర్టు తీర్పునిచ్చింది. పసిపాపపై ప్రవీణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 48 రోజుల క్రితం హన్మకొండ రెడ్డి కాలనీలో ఇంటి డాబా మీద తల్లి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారిని ప్రవీణ్ ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై ఇంత త్వరగా తీర్పును ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
జూన్ 18న డాబాపై నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు ప్రవీణ్ అనే కామాంధుడు. అనుమానం వచ్చిన తల్లి రచన అక్కడకు వెళ్లి చూసేసరికి చిన్నారి విగజీవిగా పడి ఉండడంతో షాక్‌కు గురైంది. చిన్నారిని పాశవికంగా అత్యాచారం చేసి చంపేశాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 51 మంది సాక్షుల్లో అవసరమున్న 30 మందిని కోర్టులో హాజరుపరిచారు. ప్రవీణ్‌ను దోషిగా నిర్ధారించిన వరంగల్ జిల్లా అదనపు కోర్టు ఉరిశిక్ష విధించింది.