భారతదేశ చరిత్ర, సంస్కృతి అంటే తనకు ఎంతో ఇష్టమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ తెలిసింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)లో భాగంగా హైదరాబాద్ చేరుకున్న ఇవాంక ఓ న్యూస్ పేపర్‌తో మాట్లాడుతు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా-భారత్ కలిసి ముందుకు సాగితే ఎంతో చేయగలమని తెలిపింది. ఆర్థిక వృద్ధి, సంస్కరణలను ప్రోత్సహించడం, ఉగ్రవాదంపై పోరాడటం, భద్రత సహకారాన్ని పెంపొందించుకోవడం వంటి విషయమాల్లో మన ప్రాధాన్యాలు ఉమ్మడివని చెప్పింది.
భారత్, అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అవకాశాలను సృష్టించడం, పౌరులందరికీ ఆర్థిక స్వావలంబన కల్పించడం అతిపెద్ద సవాలు. ఇటు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, అటు భారత్‌లో నరేంద్రమోడీ పౌరులకు ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల ప్రగతి కోసం కృషి చేస్తున్నారని తెలిపింది.
గత సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యాను. నాకు భారత్ చరిత్ర, సంస్కృతి అంటే ఎంతో ఇష్టమని ఆమెకు తెలిపానని ఇవాంక చెప్పుకొచ్చింది. జీఈఎస్ గురించి ఇవాంక మాట్లాడుతూ.. తొలిసారి ఈ సదస్సులో పాల్గొంటున్న వారిలో 50శాతం మంది మహిళలు ఉన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల సాధికారిత ఆవశ్యకతను చాటిచెప్పేందుకు ఈ సదస్సు ఓ అంతర్జాతీయ వేడుకగా నిలుస్తుందని నేను భావిస్తున్నారు. మహిళలు రాణిస్తే.. సమాజాలు, దేశాలు వర్ధిల్లుతాయి తెలిపింది ఇవాంక.