డ్రగ్స్ కేసు: సినీ ప్రముఖులకు నోటీసులు

279
Excise police Sends Notices To Tollywood Celebrities Drugs Case
- Advertisement -

హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ మాఫియాను కూకటివేళ్ళతో పేకలివేసేందుకు కార్యచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం డ్రగ్స్ కేసులను డీల్ చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. గోవా, ముంబై వంటి నగరాల నుంచే కాక అమెరికాలోని షికాగో వంటి చోటి నుంచి కూడా నగరానికి డ్రగ్స్ సరఫరా కావడం అధికారులను విస్మయపరుస్తోంది.

మరోవైపు డ్రగ్స్ వ్యవహారంతో టాలీవుడ్‌కి లింక్‌ ఉండటంతో తెలుగు సినీ రంగం పరువు మొత్తం గంగలో కలిసింది. ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు, దర్శకులు, నటీనటులు డ్రగ్స్ తీసుకుంటున్నారన్న వార్తలతో టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఉదయం ఇండస్ట్రీ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కొందరి వల్ల పరిశ్రమ పరువు పోతోందని వాపోయారు. సరైన మార్గంలో నడవాలని సూచించారు.

మరోవైపు, డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన 10 మందికి ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, ఒక స్టంట్ మాస్టర్ ఉన్నారు. విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఆ 10 మంది ఎవరనే పేర్లు మాత్రం వెల్లడించలేదు. వీరంతా ఆరు రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. పరిశ్రమకు చెందిన పలువురికి నోటీసులు జారీ అయ్యాయనే వార్తలతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలికిపాటుకు గురైంది.

తెలంగాణ పోలీసులు ఈ మాఫీయా పై చేస్తున్న పోరాటాన్ని ప్ర‌శంసించారు నిర్మాత అల్లు అర‌వింద్. సినీ ప‌రిశ్ర‌మ‌లో 15 మంది నటీనటులు డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌ని, వారికి నేను చేసే డిమాండ్ ఒక్క‌టే అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. పిల్లి క‌ళ్ళు మూసుకొని పాలు తాగుతున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తే అది క‌రెక్ట్ కాదు, మీరు చేస్తున్న ప్ర‌తి ఒక్క అంశం ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర ఉంది.. డ్రగ్స్ ఎప్పుడు? ఎక్కడ? ఎవరి వద్ద? ఎలా? తీసుకున్నారన్న ప్రతి రికార్డు కూడా వారి వద్ద వుంది అని అర‌వింద్ అన్నారు. కేవలం మీ భవిష్యత్ నాశనం చేయకూడదన్న ఉద్దేశంతోనే పోలీసులు మీ 15 మందిని ఉపేక్షిస్తున్న‌ట్టు తెలిపారు.

- Advertisement -