స్వాంతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం 3.45 నిమిషాలకు సైరా మేకింగ్ వీడియో రిలీజ్ కానుండగా అంతకంటే ముందే సినిమాలో కీ రోల్ పోషించిన వారి లుక్స్‌కి సంబంధించిన వీడియోని రిలీజ్ చేసింది ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్.
అమితాబ్ బచ్చన్, చిరంజీవి, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవి కిషన్, నయనతార ,తమన్నా, నిహారిక అందరి లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అక్టోబర్ 2న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్‌చేస్తున్నారు.
Excel Entertainment and AA Films proudly present the EPIC #SyeRaaNarasimhaReddy in association with Konidela Productions starring the GREATEST Indian ensemble cast of all time. pic.twitter.com/K0OQLVpErD
— Excel Entertainment (@excelmovies) August 13, 2019