సంగీతకు ఫ్యామిలీ కోర్టులో ఊరట

201
Ex TRS Youth Leader Srinivas Reddy Case
- Advertisement -

భర్త చేత చిత్రహింసలకు గురై.. తనకు న్యాయం కావాలంటూ 54 రోజులుగా భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుటే దీక్ష చేస్తున్న సంగీతకు ఊరట లభించింది.సంగీతకు నెలకు ఇరవై వేల రూపాయలు చెల్లించడంతో పాటు ఇంట్లో ఉండేందుకు అనుమతించాలని మియాపూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కేసు విచారణలో భాగంగా ఇవాళ సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డి, అతని తల్లిదండ్రులు కోర్టుకు హాజరయ్యారు. కేసు తీర్పు వెలువరించిన న్యాయస్ధానం సంగీతను గౌరవ ప్రదంగా ఇంట్లోకి భర్త తీసుకెళ్లాలని ఆదేశించింది.

భర్త, అత్తమామలు కొడుతూ, లైంగికంగా వేధిస్తున్నారంటూ సంగీత కేసు పెట్టిన విషయం తెలిసిందే. మొత్తం మూడు కేసులు ఆమె పెట్టారు. ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు మద్యవర్తులు ప్రయత్నించిన ఫలితం మాత్రం దక్కలేదు. అయితే చివరికి ఈ కేసుకు సంబంధించి భర్త, అత్తమామలు కోర్టుకు హాజరుకాగా సంగీతకు ఊరట కలిగించేలా న్యాయస్ధానం తీర్పు వెలువరించింది.

అయితే, దీనిపై భర్త శ్రీనివాస్‌రెడ్డి మరోసారి కౌంటర్‌ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డి పేరుతో ఎలాంటి ఆస్తులు,ఇళ్లు లేవని ఆయన తల్లిదండ్రులు వాదించనున్నట్లు సమాచారం. దీంతో పాటు భార్యను బాగానే చూసుకుంటానని, ఆమె తన వద్దే ఉంటుందని అలాంటప్పుడు మెయింటెన్స్‌ ఖర్చులు ఎందుకు ఇవ్వడం అని ఆ కౌంటర్‌లో పేర్కొననున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -