తమ్మూ వద్దంటోంది…కారణం..?

230
tamanna regects john abraham movie offer
- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా అందరికీ షాకిచ్చినంత పనిచేస్తోంది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా..వచ్చే ఛాన్స్‌లకు నిర్మొహమాటంగా నో అంటోంది. బాలీవుడ్ లో పిలిచి అవకాశం ఇస్తామంటుంటే హీరోయిన్లు పూజా హెగ్డే, తమన్నాలు వద్దు పొమ్మంటున్నారు.

tamanna regects john abraham movie offer

అసలు విషయానికొస్తే.. కండల వీరుడిగా పేరుగాంచిన జాన్ అబ్రహాం సరసన నటించే అవకాశం వీరిద్దరి తలుపు తట్టింది. మామూలుగా అయితే ఇది బంపర్ ఆఫరే. కానీ.. వీరు మాత్రం వద్దనుకున్నారు. కారణం…? ప్రస్తుతం జాన్ పరిస్థితి ఏమీ బాగోలేదని. వరుస ఫ్లాపులతో డిజాస్టర్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు జాన్ . ఇలాంటి పరిస్థితుల్లో జాన్ సరసన నటిస్తే, మొదటికే మోసం వస్తుందని ఈ భామలు భావిస్తున్నారు.

పూజా హెగ్డే వరకైతే ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె చేతిలో కాస్తో కూస్తో సినిమాలు ఉన్నాయి. కానీ, తమన్నా దాదాపు ఖాళీగానే ఉంది. అయినా ఎందుకు నో అంది..? అనే డౌట్‌ ఫ్యాన్స్‌ లో స్టార్టైంది. ఏదేమైనా…ఎందుకిలా చేసిందో తమ్మూకే తెలియాలి.

- Advertisement -