టీఆర్ఎస్‌లోకి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి..

226
ktr suresh reddy
- Advertisement -

మాజీ స్పీకర్,కాంగ్రెస్ సీనియర్ నేత కేతిరెడ్డి సురేష్ రెడ్డి ఇవాళ టీఆర్ఎస్‌లో చేరనున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. సురేష్ రెడ్డితో పాటు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి,కరీంనగర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్,ఆకారపు భాస్కర్ రెడ్డి కారెక్కనున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బుధవారం సీఎం కేసీఆర్ సమక్షంలో అనుచరులతోకలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని వారు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు సురేశ్ రెడ్డి. వైఎస్ హయాంలో స్పీకర్‌గా పనిచేశారు. 1984లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సురేశ్ రెడ్డి…1989, 1994, 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

- Advertisement -