మాజీ ప్రధాని కర్ణాటక జేడీఎస్ అధినేత దెవెగౌడ నేడు సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 6గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకొనున్నారు. ఈసందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు అధికారులు బేగంపేట్ ఎయిర్ పోర్టులో దెవెగౌడకు స్వాగతం పలకనున్నారు. ఆ తరువాత ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
దేశంలో గుణాత్మక మార్పుకోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందడుగు వేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ , బీజీపీ లకు వ్యతిరేకంగా మూడవ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈసందర్భంగా కొద్ది రోజుల క్రితం కేసీఆర్ పలు రాష్ట్రలలోని ముఖ్యమంత్రులను, సీనియర్ నేతలను కలిసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలువురు నేతలు కూడా మద్దతు పలికారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముందడుగు వేయాలని సూచించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు దేశాన్ని పాలిస్తున్నాయని..అందుకోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. ముఖ్యంగా దేవెగౌడ ప్రస్తుత రాజకీయ పరిస్ధితులు, ఫెడరల్ ఫ్రంట్, జాతీయ రాజకీయాలపై చర్చించున్నారని తెలుస్తుంది.