30న టీఆర్ఎస్‌లోకి మాజీమంత్రి పెద్దిరెడ్డి..

124
peddireddy

ఈ నెల 30న టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. ఇటీవల బీజేపీకి రాజీమానా చేసిన పెద్దిరెడ్డి…ఏ పదవి ఆశించి టీఆర్ఎస్‌లో చేరడం లేదన్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరుతానని.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడమే తన లక్ష్యమని చెప్పారు.

ఇక ఈటల బీజేపీలో చేరిన దగ్గరి నుండి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు పెద్దిరెడ్డి. తనకు ఒక్కమాట చెప్పకుండానే ఈటలను బీజేపీలో చేర్చుకున్నారని…ఈటల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు.

మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో ఆయన జీజేపీలో చేరారు.