మాజీ మంత్రికి షాక్..వేలానికి ఆస్తులు

358
- Advertisement -

మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావుకు షాక్ ఇచ్చింది ఇండియన్ బ్యాంక్. గంటా శ్రీనివాస్ రావు ఆస్తుల్ని వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ అధికారులు ప్రకటన జారీ చేశారు. వేలంలో ఆస్తులు కొనాలనుకునే వారు ఇవాల్టీ నుంచి 15వ తేది వరకు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది.

గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ దాదాపు రూ.142కోట్లు అప్పు తీసుకుంది. ఇప్పుడది వడ్డీతో సహా రూ.221కోట్లకు చేరింది. రుణం చెల్లించకపోవడంతో ఆస్తులను ఇండియన్ బ్యాంక్ స్వాధినం చేసుకుంది. గంటా శ్రీనివాస్ తో పాటు ప్రత్యూష సంస్ధకు చెందిన 7గురు డైరెక్టర్ ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. రుణం మొత్తం ఎగవేయడంతో ఇప్పటికే ఆస్తులు స్వాధీనం చేసుకుంది.

- Advertisement -