గాలి కూతురు పెళ్లిపై ఐటీ నిఘా?

320
online news portal
- Advertisement -

గాలి జనార్ధన్‌రెడ్డి… పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటకలో మైనింగ్ సామ్రాజ్యానికి అధిపతిగా, బళ్లారి బాబుగా ఓ వెలుగు వెలిగిన గాలి జనార్ధన్‌రెడ్డి ఒకప్పుడు రాజభోగాన్నే అనుభవించారు. బంగారు కంచాలలో తింటూ, బంగారు గ్లాసుల్లో నీళ్లు తాగే ఈ బంగారు బాబు…శ్రీవారికి 40 కోట్ల విలువైన బంగారు కీరిటాన్ని చేయించిన సంగతి తెలిసిందే.అక్రమ మైనింగ్ కేసులో జైలు శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఇటీవలే గాలి బెయిల్ మీద విడుదలై కూతురు పెళ్లితో మరోసారి వార్తల్లొకి వచ్చారు.

ఇప్పటి వరకు ఎక్కడా చూడని విధంగా గాలి జనార్థన్‌ రెడ్డి కూతురు పెళ్లి ఆహ్వాన పత్రికను తయారు చేయించారు. ఒక్కో పెళ్లి కార్డ్‌ ధర ఆరువేల రూపాయిలు, కేవలం పెళ్లి కార్డుకే ఇంత ఖర్చు చేశారు. ఈ పెళ్లికి దేశంలోని వివిద రాజకీయ పార్టీలు, సిని ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరుకానున్నారు…దీంతో పెళ్లికి ఇంకెంత ఖర్చు చేస్తారో అని వార్తలు వెలువడ్డాయి.

online news portal

అయితే ఇదే ఇప్పుడు గాలికి తలనొప్పిగా మారింది.పెళ్లికి దాదాపు రూ.550కోట్లు ఖర్చు చేస్తున్నారని వార్తలు రావడంతో గాలి కూతురి వివాహాం పై ఐటీ శాఖ కన్నుపడింది. ఆదాయపుపన్ను శాఖ అధికారులు గాలి అక్రమ ఆస్తులపై మరోసారి దర్యాప్తు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ పెళ్లిపై పెడుతున్న ఖర్చు అప్పనంగా వచ్చిన సొమ్మని తేలితే గాలి మరోసారి కటకటాల పాలయ్యే అవకాశముంది. ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మూడు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపారు.

online news portal

పెళ్ళి వ్యవహారంపై గాలి అనుచరుడు శ్రీరాములు చెప్పిన మాటలు వింటే విడ్డూరంగా అనిపించక మానదు. గాలి జనార్థన రెడ్డిది మధ్యతరగతి కుటుంబమని, అందుకే మిడిల్ క్లాస్ స్టైల్లో పెళ్లి చేస్తున్నారని శ్రీరాములు చెప్పుకొచ్చారు. గాలి కూతురిదే మధ్య తరగతి పెళ్లంటే, మరి తమ ఇళ్లలో జరిగే పెళ్లిళ్లని ఇంకేమనాలని మధ్యతరగతి ప్రజలు నోరెళ్లబెడుతున్నారు..

- Advertisement -