మాజీ సీఎం రోశయ్య విగ్రహావిష్కరణ..

98
- Advertisement -

జగ్గయ్యపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని మంగళవారం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖామాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొణిజేటి రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరు జిల్లాకు కొణిజేటి రోశయ్య పేరును పెట్టాలని కోరుతూ జగ్గయ్యపేట పట్టణ 19వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ నూకల సాంబశివరావు మంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -