ఇక సెలవు.. రోశయ్య అంత్యక్రియలు పూర్తి..

94
- Advertisement -

ఉమ్మడి ఏపీ మాజీ రోశయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆదివారం కొంపల్లిలోని ఫాంహౌజ్‌లోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి రోశయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం రోశయ్య చితికి పెద్ద కుమారుడు శివ సుబ్బారావు నిప్పంటించారు.

అంత్యక్రియలకు భారీగా పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి తుది వీడ్కోలు పలికారు. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, పేర్ని నాని, బాలినేని శ్రీనివాస్‌ హాజరయ్యారు. అంతకు ముందు గాంధీభవన్‌లో కొద్ది సేపు రోశయ్య పార్థీవ దేహాన్ని ఉంచగా.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేతో పాలు పలువురు సీనియర్‌ నాయకులు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కొంపల్లిలోని ఫాంహౌస్‌ వరకు అంతిమయాత్ర నిర్వహించారు.

- Advertisement -