‘రామారావు ఆన్‌ డ్యూటీ’ లేటెస్‌ అప్‌డేట్‌..

57

మాస్‌ మహారాజా రవితేజ, దర్శకుడు శరత్‌ మండవ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. దివ్యాంశా కౌశిక్, రాజీషా విజయన్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉన్నప్పటికీ, ఈ చిత్రంపై ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్లుగానే చిత్రయూనిట్‌ కూడా ఎగ్రెసివ్‌ ప్రొమోషన్స్, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ ప్రేక్షకులు అటెన్షన్‌ను గ్రాబ్‌ చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఖరారైన మాస్‌ టైటిల్‌ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రవితేజ అభిమానులతో పాటుగా సినిమా లవర్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.అంతేకాదు..టైటిల్‌కు, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు సూపర్భ్‌ పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుండటం చిత్రయూనిట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సర్‌ప్రైజింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది.

ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి టీజర్స్ రాలేదు. అయితే రేపు (సోమవారం) ఉదయం 10 గంటల 08 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన ఓ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ఆ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించారు. రామారావు ఇష్యూయింగ్ ఆర్డర్స్ టుమారో అంటూ మెన్షన్ చేశారు. మరి ఆ అనౌన్స్ మెంట్ టీజర్ దా, లేక రిలీజ్ డేట్ దా అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరి రామారావు ఇవ్వబోయే ఆ ఆర్డర్స్ ఏంటో తెలియాలంటే.. రేపటి వరకూ ఆగాల్సిందే.