ఈవీఎంలు హ్యాకింగ్..మళ్లీ రచ్చ!

2
- Advertisement -

ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై అనేక సందేహాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధికారి సంచలన విషయాలు వెల్లడించారు. ఈవీఎంలను ఈజీగా హ్యాకింగ్ చేయవచ్చని తెలిపారు.

ఈవీఎంల భద్రత లోపాలను తులసీ గబ్బర్డ్ ఆధారాలతో సహా సమావేశంలో ప్రస్తావించారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో అప్పటి సైబర్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్ క్రెమ్స్ చర్యలపై దర్యాప్తు జరపాలని ట్రంప్ సంతకం చేసిన పాలనాపరమైన ఉత్తర్వుల తర్వాతి రోజే ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.

ఈవీఎంల హ్యాకింగ్‌కు సంబంధించిన అనేక ఆధారాలున్నాయని…పోలైన ఓట్ల ఫలితాలను హ్యాకర్లు సులభంగా మార్చగలరని తలుసీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, భారత్‌లో ఈవీఎంల భద్రతపై చర్చలు చెలరేగుతుండగా, భారత కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరోపణలను ఖండించింది. భారతదేశంలో వినియోగిస్తున్న ఈవీఎంలు ఒక సాధారణ కాలిక్యులేటర్ తరహాలో పనిచేస్తాయని ఇవి హ్యాకింగ్‌కు గురికావడం అసాధ్యం అని తెలిపారు.

Also Read:పర్యావరణ యోధుడు..వనజీవి రామయ్య

- Advertisement -