నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు హాజరుకాలేదని సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చేత ఈ నూతన పార్లమెంట్ భవనంను ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఇందుకుగాను ప్రధానమైన 19ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. తాజాగా కాంగ్రెస్ నేత తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సెంగోల్‌పై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన స్పందనను ట్వీట్ ద్వారా తెలిపారు.
సెంగోల్ వివాదంపై ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇరుపక్షాలు సెంగోల్‌పై సరైన వాదనలు వినిపించారు. అధికారంలో ఉన్న బీజేపీ ఇది రాజదండం సార్వభౌమాధికారం ధర్మ నియమం సంప్రదాయాల కొనసాగింపుగా పేర్కొంటున్నారు. అలాగే కాంగ్రెస్ ఇతర దాని మిత్రపక్షాలు మాత్రం…ప్రజల పేరుతో రాజ్యాంగం ఆమోదించబడిందని సార్వభౌమాధికారం అనేది పార్లమెంట్‌లో భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఉంటుందని అది దైవిక హక్కుగా రాజులకు సంక్రమించే విశేషాధికారం కాదని అంటోంది.
అధికార మార్పిడికి గుర్తుగా మౌంట్‌బాటన్ సెంగోల్‌ను నెహ్రూకు అందించారన్న ఆధారాలు లేని వాదనను ఇరు పక్షాలు మర్చిపోతే ఈ వివాదం ముగుస్తుందన్నారు. అయితే సెంగోల్ రాజదండాన్ని అధికారానికి సంప్రదాయ చిహ్నం కాబట్టి దాన్ని లోక్‌సభలో ఉంచడం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారం ఏ రాజు దగ్గర లేదని విషయం స్పష్టమవుతుంది. ప్రస్తుత విలువలకు చిహ్నంగా అందరం సెంగోల్‌ను అంగీకరించాలి అని థరూర్ ట్వీట్‌లో వెల్లడించారు.
Also Read: PMMODI:ఎన్టీఆర్ యుగపురుషుడు