గుడ్డు అనేది సర్వ పోషకాల సమ్మేళనం అని అందరికీ తెలుసు. అయినప్పటికి గుడ్డు తినడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు చాలా మంది. శరీరానికి సంపూర్ణ పోషకాలు అందాలన్న.. ఆయా రోగాలు దరిచేరకుండా ప్రతిరోజూ ఒక గుడ్డు తప్పనిసరిగా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.!
కోడి గుడ్డులో విటమిన్ సి, పీచు తప్పా .. మిగిలిన అన్నీ రకాల పోషకాలు, ఖనిజాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పాలు, మాంసం వంటి ప్రోటీన్ పదార్థాలతో పోలిస్తే గుడ్డులో ఉండే మాంసకృత్తులు త్వరగా జీర్ణం అవుతాయి. అందువల్ల మాంస కృత్తుల పరంగా గుడ్డు మొదటి స్థానంలో ఉంటుంది. ఇక శరీరానికి శక్తినిచ్చే అమైనో యాసిడ్స్ గుడ్డులో అధిక మొత్తంలో ఉంటాయి. ఒక గుడ్డులో 180 గ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది నేరుగా రక్తంలో కలవకుండా రక్తంలో ఉన్న లేసిబియన్ అనే పదార్థం కాపాడుతుంది. అందువల్ల గుడ్డులో ఉండే ప్రోటీన్స్ నేరుగా మన శరీరానికి అందుతాయి.
Also Read:ఆకట్టుకుంటున్న ‘జమాన’ టైటిల్ ప్రోమో
ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల రక్తపోటును నివారించవచ్చు.. అలాగే అధిక బరువు ఉన్నవాళ్ళు కూడా బరువు తగ్గడానికి గుడ్డు సహాయపడుతుంది. ఎందుకంటే గుడ్డులో ఉంటే తెల్లసొనలో ఉండే ప్రోటీన్స్ కాస్త నెమ్మదిగా జీర్ణం అవుతాయి. అందువల్ల అందువల్ల గుడ్డు తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది.ఫలితంగా ఆకలి వేయకపోవడం వల్ల శరీర బరువు సహజంగానే తగ్గుతుంది. ఇక పెద్ద వారిలో కండరాల బలహీనత ను తగ్గించి కండరాలను బలంగా తయారు చేయడంలో గుడ్డు ఎంతగానో ఉపయోగ పడుతుంది. హార్మోన్ల సమతౌల్యాన్ని సరిచేయడం, ఎంజైమ్ ల విడుదలకు తోడ్పడడం, శరీరానికి ఆవరరమైన ప్రోటీన్లను అందించడంలో గుడ్డు కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ప్రతిరోజూ ఒక గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతూ ఉంటారు.