NagaChaitanya: ప్రతి సంఘటన ఒక పాఠం నేర్పుతుంది

35
- Advertisement -

లాల్ సింగ్ చడ్డా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ వెంటపెట్టుకున్న నాగ చైతన్య… కస్టడీ కోసం హిట్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగ చైతన్య పోలీస్‌గా కనిపించనున్నారు.

మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన…తన జీవితంలో జరిగిన విషయాలపై పలు ఆంశాలను వివరించుకున్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి ప్రశ్న అడగ్గా..మీ జీవితంలో పశ్చాత్తపడ్డ సంఘటనలు విచారకరమైనవి గానీ ఉన్నాయా…అని అడగ్గా అలాంటివి ఏవీ లేవని సమాధానం చెప్పారు. ఇప్పటి వరకు నా లైఫ్‌లో విచారకరమైన సంఘటనలు ఏవీ లేవు.

Also Read: పిక్ టాక్ : ఎద అందాలతో దాడి !

జీవితంలో జరిగే ప్రతిదీ నాకు ఒక పాఠంను నేర్పుతుంది. సినిమాల విషయంలో కొన్ని సార్లు బాధపడ్డా కానీ మరికొన్ని సినిమాలపై సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోయానని పశ్చాత్తాపడుతుంటా అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగచైతన్య కస్టడీ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు.

Also Read: ప్రముఖ సింగర్ మన్నా పుట్టిన రోజు

- Advertisement -