నేటిరోజుల్లో చాలామంది అధిక బరువుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. బరువు తగ్గెందుకు రకరకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. త్వరగా బరువు తగ్గెందుకు వ్యాయామ స్థాయిని తీవ్రంగా పెంచుతూ మితిమీరిన కసరత్తులు చేస్తూ ఉంటారు చాలమంది. ఇలా చేయడం వల్ల వరువు తగ్గే అవకాశం ఉన్నప్పటికి అధికంగా వ్యాయామం చేయడం వల్ల లేని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే సులువుగా బరువు తగ్గెందుకు ప్రతిరోజూ సైకిల్ తొక్కడం అలవాటు చేసుకోవాలని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ అరగంట లేదా గంట సేపు సైకిల్ తొక్కడం వల్ల శరీరంలోని కొవ్వు శాతం గణనీయంగా తగ్గుతుంది. సైకిల్ తొక్కడం వల్ల గంటకు 400 నుంచి 600 కేలరీల శక్తిని ఖర్చు చేయవచ్చట. అందుకే వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. సైకిల్ తొక్కడం వల్ల కాళ్ళ యొక్క కండరాలు దృఢంగా తయారవడంతో పాటు మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటి సమస్యలు కూడా దురమౌతాయట. ఇక ప్రతిరోజూ సైకిల్ తొక్కడం వల్ల డిప్రెషన్, ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను అధిగమించేందుకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.
Also Read:మొక్కజొన్న పీచుతో ఆరోగ్య ప్రయోజనాలు..!
సైకిల్ తోక్కే అలవాటు ఉన్నవారిలో రక్త ప్రసరణ మెండుగా జరుగుతుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ. ఇక పురుషుల్లో శృంగార సమస్యలతో బాధపడే వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజూ సైక్లింగ్ చేస్తే ఎంతో మేలట. ప్రతిరోజూ సైక్లింగ్ చేయడం వల్ల జననేంద్రియలకు రక్త ప్రసరణ పెరిగి అంగస్తంభన, శీఘ్రస్కలనం వంటి సమస్యలు దూరమౌతాయని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజూ ఒక గంట సైక్లింగ్ కు టైమ్ కేటాయిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నా మాట.
Also Read:ఈ టైంలో నీళ్లు తాగండి..ఆరోగ్యంగా ఉండండి!