సుమన్- సుహాసిని ముఖ్య పాత్రల్లో లవ్ సస్పెన్స్ థ్రిల్లర్..

156
Ever Green Creations

ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ పతాకం పై రాజు శెట్టి దర్శకత్వం లో రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రం ఈరోజు వాళ్ళ ఆఫీస్‌లో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. యూనిట్ సభ్యులందరు పూజ కార్యక్రమంలో పాల్గొని సినిమా విజయవంతం అవ్వాలని దేవుడిని వేడుకున్నారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో

దర్శకుడు రాజు శెట్టి మాట్లాడుతూ “ఎవర్ గ్రీన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న మూడో చిత్రం ఇది. రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది మాఫియా నేపథ్యంలో లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. సినిమా అంత గోవా లో మంచి రిచ్ లొకేషన్స్ లో సినిమా చేస్తున్నాము” అని తెలిపారు.

Ever Green Creations

నిర్మాతలు రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి మాట్లాడుతూ “సినిమా కథ నాకు చాలా బాగా నచ్చింది. దర్శకుడు రాజు శెట్టి సినిమాని అనుకున్న బడ్జెట్‌లో ప్లాన్ చేశారు. సింగల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తీ చేయటానికి అని ప్రయత్నాలు చేస్తున్నాము. సుమన్, సుహాసిని ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సినిమా బాగా వస్తుంది అని నమ్మకం నాకుంది” అని అన్నారు.

హీరోయిన్ లవ్లీ అగర్వాల్ మాట్లాడుతూ ” ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజు శెట్టికి నిర్మాతలు రవి కుమార్ రెడ్డి మరియు సత్య రెడ్డి నా కృతఙ్ఞతలు” అని తెలిపారు.

నటీ నటులు.. హీరో : కార్తీక్, హీరోయిన్ : లవ్లీ అగర్వాల్, ముఖ్యపాత్రలు : సుమన్, సుహాసిని, జబ్బర్దాస్త్ అప్ప రావు, చిట్టి బాబు, పరచురమ్ సుధాకర్.