దర్శకుడిగా మారిన బోయ‌పాటి అసోసియేట్..!

192

టాలీవుడ్ మాస్ డైర‌క్ట‌ర్ బోయ‌పాటి శ్రీను అసోసియేట్ స్వ‌రాజ్ నూనె ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్‌లో సోమ‌వారం జ‌రిగింది.కార్తిక్ రాజు, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టిస్తున్నారు. సంప‌త్ రాజ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి సీనియ‌ర్ ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ హాజ‌ర‌య్యారు. బోయ‌పాటి శ్రీను కెమెరా స్విచ్ఛాన్ చేసి, గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. దర్శ‌కుడు భీమ‌నేని శ్రీనివాస‌రావు క్లాప్‌కొట్టారు.

Director Boyapati Srinu

నిర్మాత గుర‌వ‌య్య యాద‌వ్ మాట్లాడుతూ “మే 2నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెడ‌తాం. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ త‌ర‌హా చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చింది. శ్రీచ‌ర‌ణ్ పాకాల మంచి బాణీలు స‌మ‌కూర్చారు. జ‌య‌పాల్ రెడ్డి కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు“ అని అన్నారు. న‌టీన‌టులు-కార్తిక్ రాజు, వ‌ర్ష బొల్ల‌మ్మ‌, సంప‌త్ రాజ్ త‌దిత‌రులు.