‘సాహో’లో మారో బాలీవుడ్‌ నాయిక..

372
Evelyn Sharma joining in Prabhas 'Saho'
- Advertisement -

బాహుబలి చిత్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఆయన హీరోగా భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మరో చిత్రం ‘సాహో’. ఈ సినిమాకు (రన్ రాజా రాజా రన్) ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రధ్దా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Evelyn Sharma joining in Prabhas 'Saho'ఇప్పడు తాజాగా ఈ చిత్రంలో మరో బాలీవుడ్‌ హీరోయిన్ ఎవ్లిన్‌ శర్మ నటిస్తున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ‘యారియా’, ‘కుచ్‌ కుచ్‌ లోచా హై’, ‘యే జవానీ హై దివానీ’చిత్రాల్లో నటించిన ఆమే ఏకంగా ఈ సినిమాలో యాక్షన్‌ ఘట్టాల్లో కన్పించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా కోసం ఏకంగా 10 కిలోల బరువు కూడా తగ్గారట. ఇంతకు ఈ అమ్మడు ఈ సినిమాలో నటిస్తున్నారా? లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రం ప్రస్తుతం దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. 2019లో ఈ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు.

- Advertisement -