ప్రభాస్‌ మూవీలో జర్మన్ బ్యూటీ..

307
Evelyn Sharma feels blessed to be a part of 'Saaho'
- Advertisement -

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రెబల్‌స్టార్‌ ప్రభాస్ ఆ సినిమా తర్వాత నటిస్తున్న చిత్రం సాహో. ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ‘అబుదాబి’లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. అంతేకాదు ఈమూవీలో కొత్త కొత్త యాక్టర్లను జత చేసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తుందగా మరో కీలకమైన పాత్రలో బాలీవుడ్ భామ ఎవెలిన్ శర్మ కనిపించనుంది. ఈ విషయాన్ని తాజాగా ఎవెలిన్ శర్మ స్పష్టం చేసింది.

Evelyn Sharma feels blessed to be a part of 'Saaho'‘సాహో మూవీలో ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు సుజిత్ నన్ను అప్రోచ్ అయిన మాట వాస్తవమే. అఫ్ కోర్స్.. నేను వెంటనే ఒప్పుకున్నాను కూడా. ఇప్పటివరకూ నేను చేసిన రోల్స్ తో పోల్చితే.. ఇది చాలా విభిన్నమైన క్యారెక్టర్ అవుతుంది. నా ట్యాలెంట్ ను చూపించడానికి ఇదో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను’ అని తెలిపింది ఎవ్లిన్ శర్మ.

దక్షిణాదిలో తనకు ఇంతకంటే గ్రాండ్ లాంఛ్ లభించే అవకాశం లేదంటూ.. సాహో చిత్రంపై తన ఒపీనియన్ చెప్పింది ఎవ్లిన్ శర్మ. సాహో మూవీలో ఎవ్లిన్ శర్మ కొన్ని స్టంట్స్ కూడా చేయనుందట. వీటిని తన అభిమానులు విపరీతంగా ఎంజాయ్ చేస్తారని.. ఇందుకోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నానని చెబుతోంది ఎవ్లిన్ శర్మ. ఇంతకు ముందు ‘ఫ్రం సిడ్నీ విత్ లవ్’ అనే చిత్రంతో అరంగేట్రం చేసింది ఎవ్లిన్ శర్మ. అయితే గతంలో తనకి మహేశ్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ వచ్చిందనీ, అందుకు డేట్స్ సర్దుబాటుకాకపోవడం వలన ఆయనతో కలిసి నటించడం కుదరలేదని అంది.

- Advertisement -