- Advertisement -
ఉక్రెయిన్ పై పోరు కొనసాగిస్తున్న రష్యాకు మరోక తలనొప్పి ఎదురైంది. యూరోపియన్ యూనియన్‌లో రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించింది. దీనికి మద్దతుగా యూరోపియన్ యూనియన్‌లో మెజార్టీ సభ్య దేశాలు అంగీకారం తెలిపింది.
ఈ తీర్మానంపై పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించగా మెజార్టీ సభ్యులు మద్దతు పలికారు. ఇందులో 494మంది సభ్యులు మద్దతు తెలపగా 58మంది వ్యతిరేకించారు. మరో 44మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. రష్యా ఈ యేడాది ఫ్రిబ్రవరి నుంచి ఉక్రెయిన్‌పై దాడిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈదాడులను తీవ్రతరం చేస్తూ పాఠశాలలు విద్యుత్ సంస్థలు చమురు సంస్థలపై దాడులను పెంచింది. అయితే ఈ తీర్మానానికి అమెరికా మద్దతు కూడా తెలిపింది.
యూరోపియన్ యూనియన్ తీర్మానం పట్ల రష్యా అగ్రహం వ్యక్తం చేసింది. యూరోపియన్ పార్లమెంటును మూర్ఖత్వానికి స్పాన్సర్‌గా అభవర్ణించారు.
ఇవి కూడా చదవండి…
ఏమైనా చేసుకోండి భయపడే ప్రసక్తే లేదు
అక్రమమైతే తీసుకోండి..దౌర్జన్యం సరికాదు
బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులు..
- Advertisement -