యూత్‌ను ఆకట్టుకుంటున్న ‘యురేక’ టీజర్..

246
Eureka Teaser

లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత నిర్మాత గా కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘యురేక’.. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకుడు.. లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఇటీవలే విడుదల కాగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.. త్వరలో నే విడుదల తేదీని ప్రకటించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.. టీజర్ ఎంతో ఇంటెన్సివ్ గా ఉంటూ సినిమాపై అంచనాలను పెంచుతుంది.

ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కాలేజ్ నేపథ్యంలో తెరకెక్కిన లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా ఇది. చాలా బాగా వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విడుదలైన కొద్దీ సేపట్లోనే టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ అంచనాలకు తగ్గకుండా సినిమా ఉంటుంది అన్నారు.

నిర్మాత ప్రశాంత్ తాత మాట్లాడుతూ.. యురేక సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికకీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. డైరెక్టర్ కార్తీక్ ఆనంద్ అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. తప్పకుండా ప్రేక్షకులు ఆదారించి ప్రోత్సహిస్తారనీ.. ప్రతి ఒక్కరు తమ నటన తో పాత్రలకీ జీవం పోశారు. త్వరలోనే ట్రైలర్, విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.

Eureka Official Teaser 4K | Karteek Anand | Shalini Vadnikatti | Munna | Dimple Hayathi | Samiksha