నేటి రోజులో చిన్న పెద్ద తేడా లేకుండా ఒత్తిడికి లోనవుతుంటారు.పెద్దల సంగతి అలా ఉంచితే.. పిల్లలకు కూడా మానసిక రుగ్మతలకు గురవుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా టీనేజ్ లోని పిల్లలు ఎదిగే సమయం.. అలాంటి టీనేజ్ లో మానసిక ఒత్తిడి కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడడం.. బరువు తగ్గడం, ఎత్తు పెరగకపోవడం.. ఎలా చాలా సమస్యలు వెంటాడుతాయి. ఇలాంటి సమస్యలకు యోగాలో ” తాడాసనం ” తో చక్కటి పరిష్కారం లభిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనం వేయడం కూడా చాలా సులభం.. అందువల్ల చిన్న పెద్ద తేడా లేకుండా ఏ వయసు వారైనా ఈ ఆసనం వేయవచ్చట.. మరి ఈ తాడాసనం వేయు విధానం, ఉపయోగాల గురించి తెలుసుకుందాం !
వేయు విధానం
ముందు నిటారుగా నిలబడి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ తరువాత శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ చేతులు పైకెత్తాలి.ఆ తరువాత శరీర భారాన్ని కాలివెళ్లపై ఉంచుతూ మునివెళ్లపై నిలబడాలి. ఈ సమయంలో శ్వాసక్రియ నెమ్మదిగా జరిగించాలి. ఇలా వీలైనంతా సమయంలో ఈ ఆసనంలో ఉంటూ మోకాళ్ళు వంగకుండా పునికాళ్లతో అడుగులు వేస్తూ ముందుకు సాగితే ఇంకా మంచిది.
లాభాలు
తాడాసనం వేయడం ద్వారా వెన్నెముక బలపడుతుంది. అంతే కాకుండా గుండెకు కూడా బలం చేకూరుతుంది. ఛాతీ వైశాల్యం పెరిగి ఊపిరితిత్తులు చురుకుగా ఉంటాయి. స్థూలకాయం వంటి సమస్యలు దూరం అవుతాయి. కాళ్ళ నుంచి వెన్నెముక వరకు నరాల వ్యవస్థ సాగదితకు గురౌతుంది. తద్వారా 15 ఏళ్ల వయసులోపు పిల్లలు వేగంగా ఎత్తు పెరగడానికి ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది.
Also Read:‘శ్వాగ్’ ..మెలోడీ సాంగ్