‘ఎత్తర జెండా’ ఫుల్ వీడియో సాంగ్‌.. రాజమౌళి ఎంట్రీ అదిరింది..

140
Etthara Jenda Full Video Song
- Advertisement -

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన టాలీవుడ్ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ భాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చాలా వేగంగా 1000 కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. అయన స్వరపరిచిన పాటలు ఈ సినిమా సక్సెస్‌లో కీ రోల్‌ అని చెప్పాలి. ట్రిపుల్‌ ఆర్‌లో అన్ని పాటలు అకట్టుకున్నాయి. ఇందులో ‘నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా ‘ ఒకటి.

తాజాగా పూర్తి పాటను విడుదల చేశారు మేకర్స్‌. ఎన్టీఆర్ .. చరణ్ ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు వేసిన పాట ఇది. స్వాతంత్ర్య సమరయోధులు.. మహావీరుల చిత్రాలను చూపుతూ సాగే ఈ పాట దేశభక్తిని పెంచుతూ ఉత్సాహభరితంగా నడుస్తుంది. ఎన్టీఆర్.. రాంచరణ్ లతో కలిసి ఆలియా భట్‌ స్టెప్పులు వేసిన పాట ఇది. అయితే ఈ పాటలో జక్కన్న మెరవడం కన్నుల వింధుగా అనిపిస్తోంది. సినిమాలో రోలింగ్ టైటిల్స్ సమయంలో ఈ పాట వస్తుంది.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. మరి ఈపాటపై మీరూ ఓ లుక్కేయండి..!

- Advertisement -