బీజేపీ నేత ఈటెల రాజేందర్ కరీంనగర్ లోక్ సభ స్థానం కోసం పోటీ పడుతున్నారా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ఈటెల.. ఆ రెండు చోట్ల కూడా ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఆయన పోటీ చేసే లోక్ సభ స్థానంపై ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని గత కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్న ఈటెల.. ఏ స్థానంలో పోటీ చేస్తారనే దానిపై సరైన స్పష్టతనివ్వడం లేదు. అయితే తాను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఈటెల ఇటీవల చెప్పుకొచ్చారు. అయితే కరీంనగర్ సీటు ఇచ్చేందుకు అధిష్టానం ఎంతవరకు మొగ్గు చూపుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే బీజేపీ అధిష్టానం మొదటి నుంచి కూడా ఈటెల విషయంలో కొంత సానుకూలత ప్రదర్శిస్తూ వస్తోంది. .
అందుకే పార్టీలో ఎవరికీ లేని విధంగా చేరికల కమిటీ చైర్మెన్ పదవి, ఎన్నికల ముందు ప్రచార కమిటీ చైర్మెన్ పదవి ఇచ్చి అధిక ప్రాధాన్యం కనబరుస్తూ వచ్చింది. అంతే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అధిష్టానం. ఈ రేంజ్ లో ఈటెలను అధిష్టానం హైలెట్ చేస్తూ వచ్చినప్పటికి ఎన్నికల్లో మాత్రం ఘోర ఓటమి తప్పలేదు. దాంతో ఇప్పుడు ఈటెలను బీజేపీ అధిష్టానం లైట్ తీసుకుంటున్నట్లు వినికిడి. అందుకే ఆయన పోటీ చేయాలనుకుంటున్న కరీంనగర్ స్థానాన్ని కూడా కన్ఫర్మ్ చేయకుండా హోల్డ్ లో పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈటెల ఆశిస్తున్న స్థానం దక్కుతుందా లేదా అనేది సందేహమే. మరోవైపు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వంటి వారు కూడా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. మరి వీరంతా లోక్ సభ ఎన్నికల్లో నైనా సత్తా చాటుతారా లేదా అనేది చూడాలి.
Also Read:తెలంగాణలో గోద్రెజ్ రూ.1000 పెట్టుబడులు