రైతుబంధుపై ఈటల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ని నవ్వులపాలు చేశాయి. ఆస్తిపన్ను చెల్లించేవారికి రైతు బంధు వర్తింప చేయవద్దని సీఎం కేసీఆర్‌కు చెప్పానని మాట్లాడిన ఈటల…ఇప్పటివరకు 10.24 లక్షల రైతు బంధు సాయాన్ని పొందారు. ఈటల రాజేందర్,ఆయన భార్య జమున,కొడుకు నితిన్ ముగ్గురి ఖాతాల్లో ఈ డబ్బు జమైంది.
ఈటలతోపాటు, భార్య జమున, కుమారుడు నితిన్‌రెడ్డి ఖాతాల్లో 2018 నుంచి రైతుబంధు నిధులు జమ అవుతున్నాయి. ముగ్గురు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరి ఖాతాల్లో మూడు లక్షల రూపాయల చొప్పున మూడేండ్లుగా జమ అవుతున్నా.. ఈటల రాజేందర్ ఒక్కసారి కూడా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదు. తనకు పంటసాయం వద్దని చెప్పలేదు.
ఈటలకు దేవరయాంజాల్‌లోనే కాదు.. ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల వందల ఎకరాల భూములున్నాయి. అయితే, ల్యాండ్‌సీలింగ్ యాక్ట్ కింద ఎక్కడ వస్తాయోననే భయంతో ఆ భూములకు రైతుబంధు తీసుకోలేదని సమాచారం. ఈటల కుటుంబానికి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల పరిధిలో 32 ఎకరాలు, తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో బినామీ పేర్లతో 110 ఎకరాలు కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈటల భూ ఆక్రమణలపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.