నేచర్ క్యూర్‌లో ఇన్ ఫర్టిలిటీ సెంటర్ : ఈటల

389
etela rajender
- Advertisement -

నేచర్ క్యూర్ లో ఇన్ ఫర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తాం అని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్ లో తెలంగాణ స్టేట్ యోగధ్యాయన పరిషత్ 9వ గవర్నింగ్ కౌన్సెల్ సమావేశంలో పాల్గొన్న ఈటల…. ప్రపంచంలో భారతీయ సంస్కృతి, ఆరోగ్యంలో చాలా మంచి పద్ధతులు ఉన్నాయన్నారు.

ప్రకృతి వైద్య చికిత్స, యునాని,హోమియోపతి, ఆయుర్వేద వైద్య విధానాలు ఎంతో గొప్పగా చికిత్స అందించాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత వైద్య ఆరోగ్యశాఖ ను గొప్పగా తీర్చి దిద్దుతున్నామని…భారతీయ సంప్రదాయ వైద్యానికి పూర్వ వైభవం తీసుకు రావడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.

ఇవాళ్టి సమావేశంలో యోగ అధ్యయన పరిషత్ , నేచర్ క్యూర్ హాస్పిటల్స్ గురించి కూలంకషంగా చర్చించి, కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అన్నారు. నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో సాయంత్రం కూడా బిపి,సుగర్, గైనిక్ సమస్యలకు ఒపి ప్రారంభిస్తున్నామని చెప్పారు.

నేచర్ క్యూర్ లో ఇన్ ఫర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తాం అని మందులు లేకుండా ప్రకృతి వైద్యం ద్వారా చికిత్స అందిస్తాం అన్నారు. నేచర్ క్యూర్ కాలేజీ లో 2021నుంచి పీజీ కోర్సులు ప్రారంభింస్తాం….బెంగుళూరు కంటే గొప్పగా నేచర్ క్యూర్ ను చేస్తాం అన్నారు. హాస్పిటల్ అభివృద్ధికి 6 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా.. వాటిని మంజూరు చేయాలని నిర్ణయించాం అన్నారు. ప్రాణాయామలో బీఎస్సీ,ఎమ్మెస్సీ,పీజీ డిప్లమా కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించామని తెలిపారు.

- Advertisement -