మరో భూకబ్జా వివాదంలో ఈటల..!

55
etela

మరో భూవివాదంలో చిక్కుకున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఇప్పటికే మెదక్‌ జిల్లాలోని అచ్చంపేట్‌, హకీంపేట్‌, దేవరయాంజల్‌లో అసైన్డ్‌ భూములు కబ్జాచేసినట్టు ఈటల రాజేందర్‌పై ఆరోపణలు రావడం వాటిపై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈటల రాజేందర్ తనయుడి మెడకు భూ కబ్జా ఆరోపణ చుట్టుకుంది. మేడ్చల్‌ మండలం రావలకోల్‌ గ్రామానికి చెందిన పిట్లం మహేష్‌… ఈటల కుమారుడిపై సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. రావలకోల్ గ్రామంలోని సర్వే నెంబర్ 77లో సుమారు 10.11 ఎకరాల భూమి ఉంది. దీన్ని 1975-76లో సీలింగ్ యాక్ట్ ప్రకారం తన తాత పిట్లం నరసింహంకు చెందినదిగా ధృవీకరిస్తూ ప్రభుత్వం సర్టిఫికెట్‌ను అందజేసిందని దానిని ఈటల కుటుంబ సభ్యులు బలవంతంగా తమ పేరు మీదకు మార్చుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అధికారులపై ఒత్తిడి తెచ్చి పట్టాదారు పాసు పుస్తకాలు కూడా పొందారని ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని గతంలో ఈటల రాజేందర్ దృష్టికి కూడా తీసుకెళ్లానని.. అయితే ఆయన తనను బెదిరించారని చెప్పారు. తన తాత పేరు మీదున్న భూమిని తనకు వచ్చేలా చూడాలని సీఎంను కోరారు.