నీకు చేతకాకపోతే రాజీనామా చెయ్ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. మీడియాతో మాట్లాడిన ఈటల… సీఎం హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతారా అని మండిపడ్డారు. అయినా సిగ్గులేకుండా అట్లనే కొనసాగుతా అంటే ప్రజలే బుద్ధి చెప్తారు అని దుయ్యబట్టారు.
తెలంగాణలో ఇప్పుడు చెప్పులు ఎత్తుకుపోయే దాని మీద చర్చ నడుస్తుంది అని చురకలు అంటించారు కేంద్రమంత్రి బండి సంజయ్. చెప్పులు ఎత్తుకు పోవడం కాంగ్రెస్ పార్టీ కల్చర్ కావొచ్చు .. చెప్పులు ఎత్తుకపోయేవాడి లాగా రేవంత్ రెడ్డిని ఎవరు చూశారు చెప్పాలన్నారు.
నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… అప్పు కోసం పోతే నన్ను దొంగని చూసినట్టు చూస్తున్నారు అని చెప్పిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకు పోతాడేమో అని నాకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు… నన్ను ఎవరూ బజారులో నమ్మడం లేదు అన్నారు రేవంత్. దీనికి ఘాటుగా స్పందించారు బీజేపీ నేతలు.
Also Read:INTUC నేతలతో పొన్నం భేటీ

