పాపం ఈటెల.. భయం భయం!

36
- Advertisement -

హుజూరాబాద్ నియోజిక వర్గంలో బీజేపీ నేత ఈటెల రాజేందర్ ను ఓటమి భయం వెంటాడుతోందా ? అందుకే ఆయన దిక్కుతోచని స్థితిలో ఉన్నారా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయవాదులు. హుజూరాబాద్ ప్రజలు ఎప్పటికప్పుడు భిన్నమైన తీర్పునిస్తూ వచ్చారు. ఇక్కడ నాలుగు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు టిడిపి, మరో రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తూ వచ్చారు. ఇక 2004,08 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ ( టి‌ఆర్‌ఎస్ ) తరుపున లక్షి కాంతరావు విజయం సాధించారు. ఆ తరువాత 2009,14,18 ఎన్నికల్లో వరుసగా బి‌ఆర్‌ఎస్ తరుపున ఈటెల రాజేందర్ విజయం సాధిస్తూ వచ్చారు. అయితే ఆయన బి‌ఆర్‌ఎస్ వీడి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2021లో బైపోల్ అనివార్యం కాగా.. ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగి గెలుపొందారు ఈటల. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు తారుమారు అయ్యాయి.

నియోజకవర్గంలో ఈటెల గ్రాఫ్ పడిపోయినట్లు తెలుస్తోంది. పైగా బి‌ఆర్‌ఎస్ తరుపున ఈసారి పాడి కౌశిక్ రెడ్డి బరిలో ఉండడంతో ఈటల ను ఓటమి భయం వెంటాడుతోందట. దానికి తోడు బీజేపీ అగ్రనాయకుల ఒత్తిడి కారణంగా కే‌సి‌ఆర్ తో పోటీకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కే‌సి‌ఆర్ ను ఢీ కొట్టి నిలవడం కష్టమే అని తెలిసినప్పటికి గజ్వేల్ లో ఆయనకు పోటీగా ఈటెల బరిలో ఉన్నారు. దీంతో ముందు నుంచే ఓటమి భయం ఈటెల ను వెంటాడుతోందట.

అటు హుజూరాబాద్ లోనూ డేంజర్ బెల్స్, ఇటు గజ్వేల్ లో ఏమాత్రం గెలవలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం గా మారే అవకాశం లేకపోలేదని కొందరు రాజకీయ అతివాదులు అభిప్రాయ పడుతున్నారు. అయితే బి‌ఆర్‌ఎస్ లో ఉన్నప్పుడూ సీనియర్ నేతగా మంచి ప్రదాన్యత కలిగిన ఈటెల.. బీజేపీ లోకి వెళ్ళిన తరువాత సరైన ప్రాధాన్యత కరువై కమలం పార్టీ పెద్దల చేతిలో కీలుబొమ్మగా మారినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈటెల రాజేందర్ ను కాషాయ పార్టీ నిండా ముంచేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. మరి ఎన్నికల్లో ఫలితాలను బట్టి ఈటెల కమలం పార్టీ వీడతారేమో చూడాలి.

Also Read:కాంగ్రెస్ లో మంట.. చీలిక ఖాయమేనా?

- Advertisement -