కరోనాపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దు…

341
etela rajender
- Advertisement -

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని వస్తున్న వందతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు మంత్రి ఈటల రాజేందర్. బుధవారం మీడియాతో మాట్లాడిన ఈటల…తెలంగాణలో కరోనా వైరస్ ఉన్నట్లు ఎలాంటి నిర్ధారణ కాలేదన్నారు.

ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరిన ఐదుగురు కేవలం కరోనావైరస్ అనుమానిత లక్షణాలేనని చెప్పారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ..తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా లేదన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు.

గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆసుపత్రిల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశాం అని తెలిపిన ఈటల…ఆసుపత్రుల్లో ప్రత్యేక నోడల్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేశాం అన్నారు.

కరోనా వైరస్‌ను గుర్తిచేందుకు అవసరం అయ్యే పరికరాలు మన దగ్గర లేవు. వీటి కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాం అన్నారు. కొంతమంది సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు….ఆ వదంతులను నమ్మవద్దన్నారు.

- Advertisement -