తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో వారిద్దరూ!

11
- Advertisement -

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు సాధించి సత్తాచాటింది బీజేపీ. ఇక కేంద్రమంత్రి వర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరికి చోటు దక్కగా ఇప్పుడు పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించింది ఆ పార్టీ అధిష్టానం.

ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉండగా రెండోసారి కేంద్రమంత్రి కావడంతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై దృష్టి సారించారు బీజేపీ నేతలు.అధ్యక్ష పదవి రేసులో ఈటల రాజేందర్, డీకే అరుణతో పాటు రఘునందన్‌ రావు, ధర్మపురి అరవింద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

అయితే ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల పేరు వినబడుతోంది. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఈటల పేరును ప్రధాని మోడీ పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తంగా త్వరలోనే టీబీజేపీ చీఫ్ ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read:నూకాంబికా అమ్మవారి సన్నిధిలో పవన్

- Advertisement -