Bandi:”బండి సీటు”.. వద్దు బాబోయ్!

31
- Advertisement -

తెలంగాణ బీజేపీలోని అగ్రనేతలైన బండి సంజయ్ మరియు ఈటెల రాజేందర్ మద్య కోల్డ్ వార్ జరుగుతుందనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ డీలా పడడానికి ఒకరకంగా వీరిద్దరి మద్య ఉన్న విభేదాలే కారణమనే టాక్ వినిపిస్తూ వచ్చింది. మరి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంలో కూడా ఈటెలనే కారణమనే వాదన కూడా గట్టిగానే నడించింది. అయితే వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇరువురు పలుమార్లు క్లారిటీ ఇచ్చినప్పటికి నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి ఈ ఇద్దరు మీడియాలో హైలెట్ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఈటెల, బండి సంజయ్.. పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. .

ఈ నేపథ్యంలో వీరిద్దరు పోటీ చేసే స్థానాలపై ఆసక్తి నెలకొంది. గత కొన్నాళ్లుగా ఈటెల రాజేందర్ కరీంనగర్ బరిలో నిలుస్తారనే టాక్ గట్టిగా వినిపించింది. అయితే కరీంనగర్ ఎంపీగా ఆల్రెడీ బండి సంజయ్ పదవిలో ఉన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆయన కరీంనగర్ సీటు పైనే పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. మరి బండి సంజయ్ ఉన్నప్పటికి ఈటెల ఆ సీటుపైనే ఎందుకు కన్నెశారు అనే గుసగుసలు కూడా నడిచాయి. అయితే తాజాగా తాను పోటీ చేసే స్థానంపై స్వయంగా ఈటెలనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కరీంనగర్ స్థానంలో బండి సంజయ్ ఉన్నారని, అందుకే ఆ సీటు కాకుండా మల్కాజ్ గిరి సీటు కావాలని అధిష్టానాన్ని కోరినట్లు ఈటెల చెప్పుకొచ్చారు. అయితే మల్కాజ్ గిరి సీటును అధిష్టానం ఈటెలకు కేటాయిస్తుందా లేదా అనేది డౌటే. మరి ఈ ఇద్దరి మద్య ఎలాంటి వివాదం తలెత్తకుండా బీజేపీ అధిష్టానం ఎవరెవరికి ఏ ఏ సీట్లు కేటాయిస్తుందో చూడాలి.

Also Read:వీటితో ఆరోగ్యం పదిలం!

- Advertisement -