బీ కేర్ ఫుల్ కొడకా..బండిపై ఈటల ఫైర్!

23
- Advertisement -

కేసీఆర్, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లతో కొట్లాడినవాడిని.. బండి సంజయ్ లాంటి వాడితో కొట్లాడితే నా పతార ఏం కావాలి అని దుయ్యబట్టారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎంపీకి కూడా అన్ని ఓట్లు వేయించాను అని చెప్పారు.

2019లో ఆనాడు నువ్వు కరీంనగర్ ఎంపీగా గెలిచినా హుజురాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి 53 వేలు మెజారిటీ వచ్చింది.. రేపు నా మనుషులే సర్పంచ్‌గా, వార్డ్ మెంబెర్‌గా ఉంటారు అని తెలిపారు రాజేందర్. ఈటల వర్గానికి టికెట్లు ఇవ్వను అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

బీ కేర్ ఫుల్ కొడకా అంటూ బండి సంజయ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేను శత్రువుతో కోట్లాడుతా… కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోను నా కొడకా అని దుయ్యబట్టారు.

Also Read:సిట్ విచారణకు వైసీపీ ఎంపీ మిథున్

కరీంనగర్ జిల్లాలో ఒరిజినల్ బీజేపీ వాళ్ళ లిస్ట్ రాస్తే ఒక కమ్మ సరిపోతది… మా ఈటెల అనుచరుల గురించి రాయాలంటే బుక్కులు కూడా సరిపోవు అని కరీంనగర్ జిల్లా కృష్ణారెడ్డి మీద సెటైర్ వేశారు ఈటల అనుచరుడు.

- Advertisement -