- Advertisement -
బాలీవుడ్ బాద్ షా, కింగ్ షారుఖ్ ఖాన్‌కు గాయాలయ్యాయి. షూటింగ్ సమయంలో కండరాలకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం అమెరికా తరలించారు. ప్రస్తుతం షారుఖ్ కింగ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. తన కూతురు సుహానాతో కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు షారుఖ్.
ఇవాళ కింగ్ సినిమా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా షారుఖ్ ఖాన్ కు గాయాలయ్యాయి. నెల రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్స్ తెలపగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
షారుఖ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Also Read:సిట్ విచారణకు వైసీపీ ఎంపీ మిథున్
- Advertisement -

