తెలంగాణ బీజేపీలో వర్గపోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఎన్నిక తర్వాత ఈ వివాదం తారాస్థాయికి చేరింది. పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయగా బీజేపీ అధిష్టానం సైతం ఆయన్ని సస్పెండి చేసింది.
ఇక పార్టీ అధ్యక్ష పదవి ఆశీంచి భంగపడ్డారు ఎంపీ ఈటల రాజేందర్. దీనికి కారణం బండి సంజయ్ అని ఈటల వర్గం భావిస్తుండగా తాజాగా బండి చేసిన కామెంట్స్ మరింత ఆజ్యం పోసింది. ఈటల వర్గానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనంటూ బండి సంజయ్ బహిరంగ హెచ్చరిక జారీ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో హుజురాబాద్ సెగ్మెంట్‌లో నాకు ఓట్లు రానివ్వకుండా చేశారు … నన్ను ఓడించడానికి ప్రయత్నించిన వారికి నేను ఎలా టిక్కెట్లు ఇస్తానని మండిపడ్డారు. ఈటల వర్గంపై బండి బహిరంగ వ్యాఖ్యలతో పార్టీలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్, ఈటల అనుచరుడు గౌతమ్ రెడ్డి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొంతమంది ఉన్నట్లు సమాచారం. మొత్తంగా బండి వర్సెస్ ఈటల మధ్య వివాదం మరింత తారాస్థాయికి చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:TTD:ఆగస్టు 6 నుండి తెప్పోత్సవాలు

