తెలంగాణ వెదర్ అప్డేట్ ఇచ్చారు అధికారులు. మరో నాలుగు రోజులపాటు రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని తెలిపారు. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇవాళ కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ అతలాకుతలం అయింది.
భారీ వర్షంతో చెరువులను తలపించాయి రహదారులు, ఫ్లైఓవర్లు. ఎక్కడికక్కడే స్తంభించిపోయింది ట్రాఫిక్, గంటలకొద్దీ నరకయాతన అనుభవించారు వాహనదారులు. కంటోన్మెంట్, బోయిన్పల్లిలో రికార్డు స్థాయిలో వర్షపాతం కురిసింది. పలు చోట్ల నేలకొరిగిన చెట్లు, కుప్పకూలాయి గోడలు.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్ సెంటర్ చాంద్రాయణ గుట్టలో కూలింది ప్రహరీ గోడ. ఆ దృశ్యం సి సి ఫుటేజ్ రికార్డ్ అయింది… గోడ పక్కన ఎవరు లేకపోవడంతో తప్పింది ప్రమాదం.
Also Read:TTD:ఆగస్టు 6 నుండి తెప్పోత్సవాలు

