‘ప్రెష‌ర్ కుక్క‌ర్’ను దక్కించుకున్న అభిషేక్ పిక్చ‌ర్స్‌..

544
- Advertisement -

స‌క్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూట‌ర్‌, నిర్మాత అభిషేక్ పిక్చ‌ర్స్ అభిషేక్ నామా `ప్రెష‌ర్ కుక్క‌ర్‌` థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నారు. `ఇస్మార్ట్ శంక‌ర్‌`, `రాక్ష‌సుడు` వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చ‌ర్స్ అభిషేక్ నామా రీసెంట్‌గా `జార్జ్‌రెడ్డి` సినిమా హ‌క్కుల‌ను కూడా సొంతం చేసుకున్నారు.

సాయిరోన‌క్‌, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `ప్రెష‌ర్ కుక్క‌ర్‌`. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌స్తుంది. కాన్సెప్ట్ నచ్చిన డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ ఈ సినిమా టీజ‌ర్‌ను క‌ట్ చేయ‌డం విశేషం. సుజోయ్‌, సుశీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. సునీల్ క‌శ్య‌ప్‌, రాహుల్ సిప్లిగంజ్‌, స్మ‌ర‌ణ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.

Pressure-Cooker-Movie

క‌ర‌మ్‌పురి క్రియేష‌న్స్‌, మైక్ మూవీస్ ప‌తాకాల‌పై సుజోయ్‌, సుశీల్‌, అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి దర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో న‌టీన‌టులుగా సాయిరోన‌క్‌, ప్రీతి అస్రాని, రాహుల్ రామ‌కృష్ణ‌, రజ‌య్ రోవాన్‌, తనికెళ్ల భ‌ర‌ణి, సీవీఎల్ న‌ర‌సింహారావు త‌దిత‌రులు నటించారు.

- Advertisement -