ESI స్కాం..దేవికా రాణి అరెస్ట్

500
esi scam
- Advertisement -

ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల అక్రమాలపై ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఓ ఛానల్ రిపోర్టర్ సహా 23 మంది ఇళ్లల్లో సోదాలు జరుపుతున్న ఏసీబీ అధికారులు తాజాగా ఐఎంఎస్ డైరెక్టర్ దేవికా రాణిని అరెస్ట్ చేశారు.షేక్ పేట్ లోని తన నివాసం నుండి దేవికా రాణిని బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

ఇప్పటికే పలు రికార్డులు, హార్డ్‌ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌ కేంద్రంగా మెడికల్‌ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 10 కోట్ల రూపాయల మేర గోల్‌మాల్‌ అయినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఈఎస్ఐ ఉద్యోగులతో కలిసి దేవికారాణి అక్రమాలకు పాల్పడిందని ఏసీబీ అధికారులు తెలిపారు.

scam esi

2018 నవంబర్ 3న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫిర్యాదు అందింది. దీన్ని బేస్ చేసుకుని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా వివరాలు సేకరించే పనిలో ఉండగా… వారికి షాకింగ్ నిజాలు తెలిశాయి. దేవికారాణికి అనేక బినామి కంపెనీలున్నాయని వెల్లడైంది.

దీంతో  ఏసీబీ అధికారులు ఈ కేసులో మరింత దూకుడు పెంచగా ఈఎస్ఐ స్కామ్ లో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. అసలు ఫార్మా కంపెనీలు లేకుండానే మందులను కొనుగోలు చేశారు. ఎక్కడ ఉపయోగం లేని మందులను కూడా కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. 10 కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్టుగా పత్రాలతో సహా ఏసీబీ ఆధారాలు సేకరించగా దాదాపు 100 కోట్ల మేర అవినీతి జరిగినట్టుగా అధికారులకు ప్రాథమికంగా సమాచారం అందినట్టు తెలుస్తోంది.

- Advertisement -