రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు మాత్రం గడప దాటవు అనడానికి ఇది మరో ఉదాహరణ అన్నారు ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. డీఎస్సీ 2008లో నష్టపోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది అన్నారు.
ఫిబ్రవరి 15న కాంట్రాక్టు పద్ధతిలో పోస్టింగ్స్ ఇచ్చింది. నెలకు రూ. 31,040వేతనంగా ఖరారుచేసింది…. రెండున్నర నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వారికి ఒక్క రూపాయి కూడా వేతనం ఇవ్వలేదు. కనీసం ఎంప్లాయ్ ఐడీలు కూడా క్రియేట్ చేయలేదు అన్నారు. ఈనెల 23 తో వాళ్ళ కాంట్రాక్టు గడువు ముగుస్తోంది. 24వ తేదీ నుంచి మళ్లీ వాళ్ళు నిరుద్యోగులుగా మారనున్నారు అన్నారు.
ప్రభుత్వ సమర్థత కారణంగా రూపాయి వేతనం తీసుకోకుండానే దాదాపు 1390 మంది నిరుద్యోగులైపోనున్నారు… ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మోసం చేశారు అన్నారు. ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకొని, కనీసం జీతాలు కూడా చెల్లించడం లేదు..ఇంకెన్నాళ్లు నిరుద్యోగులను మోసం చేస్తావు ముఖ్య మంత్రి ?,1390మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి అంటే దానికి కారణం నువ్వే? అన్నారు. చేసిన పనికి రూపాయి వేతనం అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కారణం నువ్వే? అని మండిపడ్డారు.
Also Read:OTT Movies: ఈ వారం సినిమాలివే !
రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి, ముఖ్యమంత్రి విదేశీయాత్రలు చేస్తుంటే, మంత్రులు హెలిక్యాప్టర్ల కోసం, ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం కొట్లాడుతున్నరు… రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లు, ఇక్కడ రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్య మంత్రి విహార యాత్రలు చేస్తున్నడు..కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు సిగ్గు అన్నారు.

