- Advertisement -
రాష్ట్రానికి కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ ఈ రోజు సంతకం చేశారు. వీటికి సంయుక్త చైర్మన్ గా సిద్ధిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్ కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ నియామకయ్యారు.
సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ ( రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయగూడ), సుంకపాక దేవయ్య ( హైదరాబాద్ నగరంలోని రాంనగర్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల) నియామకమయ్యారు.
- Advertisement -