మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుల్లెట్ బండిపై సందడి చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలంలో జరిగిన ప్లీనరీ సమావేశ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన ఎర్రబెల్లి..కార్యకర్తల కోరిక మెరుకు కొత్త బండి నడిపి మంత్రి దయాకర్ రావు ఆశీర్వదించారు. ప్లీనరీ సమావేశం ప్రాంతంలో బుల్లెట్ బండిపై తిరిగిన ఆయన సభాస్థలి నుండి మన్ పహాడ్ వరకు బుల్లెట్ బండి నడుపుకుంటూ వెళ్లారు.
మంత్రి బుల్లెట్ బైక్ నడపడంతో అందరూ ఆసక్తిగా చూశారు. బుల్లెట్ బండి నడిపారు. మంత్రి స్వయంగా బుల్లెట్ బండి డ్రైవ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిని పార్టీ కార్యకర్తలు,ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
Also Read:వాటే క్రియేటివిటీ..వెరైటీ వెడ్డింగ్ కార్డు!
వరంగల్ జిల్లాలోని తన స్వగ్రామమైన పర్వతగిరిలో ఎర్రబెల్లి దయాకర్ రావు పంట పండిస్తున్నారు. ఇటీవల పొలం పనులను పరిశీలించడానికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా కూలీలతో కలిసి పాటలు పాడుతూ నాట్లు వేశారు. అనంతరం హలం పట్టి పొలం దున్నారు. అప్పట్లో దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read:బరువు పెరగాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే !