- Advertisement -
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిపిందే. అయితే ఆయన మహమ్మారిని జయించి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాష్ట్ర సాధనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న,రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ రంగాన్ని అభివృద్ది చేస్తున్న మంత్రి కేటీఆర్‌కు కరోనా లెక్క కాదని మంత్రి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడు, పోరాట యోధుడు, అన్నింటికీ మించి ఆత్మ స్థైర్యం, గుండె నిబ్బరం కలిగిన కేటీఆర్‌ను ఇలాంటి సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టలేవు. సాధ్యమైనంత వేగంగా మంత్రి కేటీఆర్ కోలుకోవాలని, అయన సేవల కోసం నాతో సహా, యావత్ రాష్ట్రం, దేశం ఎదురుచూస్తున్నది కేటీఆర్ గారూ… గెట్ వెల్ సూన్! అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
- Advertisement -